మాత నీవు, తల్లిలా రక్షకుడా, పిత నీవు, తండ్రిలా మార్గదర్శకుడా. అన్న నీవు, నడవడికి తోడువై, స్నేహితుడివి, భయానికి అడ్డుగోడవై. వజ్రనఖముల ప్రకాశం నీవు, తీక్షణ దంతముల శక్తి నీవు. ధర్మమునకు సంరక్షకుడవై నిలిచెవు, భక్తుల దైవమై, ఆశీస్సుగా వెలిగెవు. హిరణ్యహృదయాన్ని చీల్చినవాడా, ప్రహ్లాద భక్తిని కాపాడినవాడా. నీ తేజస్సు నిత్యం జ్వలిస్తూనె ఉండగా, నీ నామస్మరణం ఆత్మకు శాంతినందించగా. విద్యకీ ఆద్యుడు నీవే స్వామీ, ద్రవిణానికి దాతవు, కరుణామయీ. సర్వస్వమై నీవు, శరణాగతివై, నీ కృపతో జీవన గమ్యం చేరే దారివై. నీవే నా ధైర్యం, నీవే నా జీవితం, నీ చరణములలోనే నాకున్న ఆశ్రయం. ***************************** జ్వాలా నృసింహా, ఉగ్ర విరాట స్వరూపా, అహోబల శక్తిమంతా, భక్త విభూతి దాయికా। మాలోల పాపనాశనా, భక్తుల హృదయనాయకా, ఉగ్ర నృసింహా, ధర్మపాలకా, సర్వజ్ఞా, సర్వశక్తి॥ భార్గవ నృసింహా, విశ్వ రక్షణ కారకా, యోగానంద పరమేశ్వరా, దయా మహాస్వరా। చత్రవట సర్వ గంభీర, సర్వశుభ ధారణీయా, కారంజ పావన రూపా, శుభమంగళదాయకా॥ పావన నృసింహా, రక్షక..పాపనాశకా నవ నృసింహా, సమస్త సృష్టి శ్రేయస్కరా। అహోబలం అహోబిలం మహా శక్తి శ్రీ ధర్మపాలకా। జయ జయ నృసింహా...
నీవుండగా నన్ను జయించెవ్వరడు, నీ చరణం నాకు శరణగావవలసెను. ఉగ్ర రూపం లోపలున్న కరుణాసముద్రా, నా తండ్రి నువ్వే, నీ నామమే నాకు ప్రాణవాయువా! అసుర బలిని చిత్తు చేసిన చాంద్రిక, నృసింహా! నీవే శరణు, నీవే సౌఖ్యం. చుట్టూ చీకటి, దారిలేనిదై, రాక్షస మూకలు చుట్టూ నిల్చి నాట్యమాడగా, నాపై నీ కరుణ కళ్లముందు ప్రకాశించగా, ప్రపంచపు ఆపదలూ నడిచిపోతున్నాయి చీకటిగా. తీర్థాల కన్నా పవిత్రమైన నీ నామం, నదుల కన్నా గొప్పది నీ కరుణా గానం, నాపై నీ చూపు, ఆ దివ్య కరుణ చూపు, అది చీకటిని నాశనం చేసే శాంతి deepam, నీ రక్షణలో రాక్షస శక్తులు విలీనమై పోవు, నీ కరుణనే సత్యం, అందులోనే నా జీవితం. O narasimha..! నీ దివ్య రూపం నా మనసులో చిరస్థాయిగా నిలచి, నీ చరణాలకు శరణాన్వితుడినై క్షేమంగా జీవింతును ఓ నరసింహా! ఓ బ్రహ్మాండనాయకా! నీ వైభవం నా గుండెలకు ధైర్యం. జయ జయ జగన్నాథ నరసింహ పరాత్పర! జయ జయ భక్తసంకటహర సింహవిగ్రహ! జయ జయ చతుర్భుజ, శంఖచక్ర గదాధర! జయ జయ బ్రహ్మాండనాయక, విశ్వరక్షక! జయ జయ నరసింహ దేవా, శరణాగత వత్సల! జయ జయ నరసింహ! జయ జయ శాశ్వత రక్షక!