ఎన్నో సంవత్సరాలుగా నాకు ఒకే ప్రశ్న పదేపదే వినిపిస్తోంది ....
“రెండో పిల్ల ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు?”
“ఒక్కరితో సరిపోతుందా?”
నేను చిరునవ్వుతో “ప్లాన్ చేయడం లేదు” అని చెబితే వెంటనే చాలా మందికి ఒక లెక్చర్ మొదలవుతుంది “ఒకరే ఉంటే ఒంటరితనం వస్తుంది”, “సోదరుడు లేకుంటే ఎలా నేర్చుకుంటాడు?”, “పెద్దవయసులో తోడుండడానికి ఇంకొకరు ఉండాలి కదా”, "సోదరుడు లేకుంటే సంబంధాలు నేర్చుకోడు”, “తల్లిదండ్రుల తర్వాత ఎవరు ఉంటారు?” అని అనేక కారణాలు చెబుతారు.… ఇలా మరెన్నో.
వారి మాటల్లో ప్రేమ ఉంటుందని నాకు తెలుసు, కానీ కొన్నిసార్లు ఆ ప్రేమే మనసుపై మౌన ఒత్తిడిగా మారుతుంది.
నేను ఒక బలమైన మహిళను, సమాజం మాట్లాడేది పెద్దగా పట్టించుకోను.
ఏ నిర్ణయం తీసుకున్నా నాలో నిశ్చయం ఉంటుంది.
కానీ, ఇటీవల చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న మౌన ఒత్తిడి నన్ను నిజంగా బాధపెట్టింది. చాలా చాలా బాధపెట్టింది...
అందుకే ఈ బ్లాగ్ రాయాలని అనిపించింది.అవును… ఇదే విషయం నన్ను లోతుగా తాకింది.
1. Other side of the coin ,కొంతమంది దంపతులు ఆరోగ్య సమస్యల వలన, ముఖ్యంగా PCOD, హార్మోనల్ ఇబ్బందులు, లేదా ఇతర వైద్య కారణాలు వలన పిల్లలు కలగకపోవచ్చు.
వాళ్లు బయట నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలతో, బాధలతో, మరియు సమాజపు ఒత్తిడితో మెలుగుతుంటారు.
ఇలాంటి సమయంలో ఎవరో ఒకరు “ఇంకా పిల్లలు లేరా?”, “ప్లాన్ ఎప్పుడు చేస్తున్నావు?”, అని అడిగితే అది సాధారణమైన ప్రశ్న కాదు, అది హృదయాన్ని గుచ్చే మాట అవుతుంది.
2. ఈ తరానికి చెందిన మహిళలు ,ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం, పిల్లల పెంపకం అన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నప్పటికీ ..
ఈ ఒక్క ప్రశ్న వాళ్ల మనసులో ఒక గోప్యమైన బరువును మోపుతుంది.
గర్భధారణ అనేది కేవలం వైద్య ప్రక్రియ కాదు; అది శరీరాన్ని, మనసును, జీవనశైలిని పూర్తిగా మార్చే ఒక అనుభవం.
3. ముఖ్యంగా గృహిణులు కూడా ఈ ఒత్తిడినే మరింతగా ఎదుర్కొంటారు.
వారికి తమ ఆరోగ్య సమస్యలు , PCOD, థైరాయిడ్, రక్తపోటు, చక్కెర, లేదా స్త్రీలకు సాధారణంగా వచ్చే హార్మోనల్ మార్పులు ..
ఇవన్నీ ఉన్నప్పటికీ, సమాజం “మరొక పిల్లవాడు ఎందుకు కాదు?” అని ప్రశ్నిస్తుంది.వారి రోజు మొత్తం ఇల్లు, పిల్లలు, భర్త, పెద్దవాళ్లు ,ఇలా అందరి చుట్టూ తిరుగుతుంది.కానీ ఆలోపల వారి శరీరం, మనసు ఎప్పుడు విరామం కోరుకుంటుందో?
ఎందుకంటే ఆ ఒక్క ప్రశ్న వెనుక దాచిన తీర్పు, పోలిక, మరియు అనవసర జోక్యం ఉంది.
కుటుంబం ఎంత పెద్దది లేదా చిన్నది అనే విషయం ఒక పోటీ కాదు, అది ప్రేమ, సమయం, మరియు బాధ్యతలతో కూడిన ఒక దీర్ఘ ప్రయాణం.
పిల్లల సంఖ్య కంటే ఇంటి వాతావరణం ముఖ్యం. ప్రేమతో, శ్రద్ధతో, భద్రతతో నిండిన ఇల్లు ఒక పిల్లవాడికి కావాల్సిన అన్ని నేర్పులను ఇస్తుంది. ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలున్న ఇంట్లోనూ అదే విషయం వర్తిస్తుంది , తల్లిదండ్రులు ఇచ్చే నాణ్యమైన సమయం, మాటల్లోని సానుభూతి, మరియు స్థిరత్వం పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి.
ఒక పిల్లవాడే ఉన్న కుటుంబం తప్పు కాదు. ఒంటరి పిల్లవాడు అని అతన్ని స్వార్థపరుడిగా చూడడం తప్పు. వాస్తవానికి, ఒంటరి పిల్లలు చాలా సార్లు ఆలోచనాత్మకులు, బాధ్యతాయుతులు, పెద్దలతో సులభంగా మెలిగేవారుగా ఎదుగుతారు. ఎందుకంటే వారికి తల్లిదండ్రుల పూర్తి శ్రద్ధ, ప్రోత్సాహం దొరుకుతుంది.
Okay ..Please think on this..!!
మన తరం ఎక్కువగా సోదరులు, సోదరీమణులతో పెరిగింది. Isn't it??
అందుకని మనమంతా సంబంధాలు చక్కగా నిర్వహిస్తున్నామా? మనం పెరిగిన తరంలో siblings ఉన్నవారిలో ఎవరైనా గొప్ప సంబంధ నిపుణులుగా మారారా, relationship Management lo expert అయ్యామా? May be or may not also...అవసరం లేదు. సంబంధాలను మేనేజ్ చేయడం నేర్పేది సోదరులు/సోదరీమణులు కాదు ,సంబంధాలను మేనేజ్ చేయడం నేర్పేది ఆత్మవిమర్శ, విలువలు, మరియు తల్లిదండ్రుల మార్గదర్శకతే నేర్పుతుంది.
పిల్లలను పెంచడం అనేది ఒక రోజు లేదా ఒక సంవత్సరం విషయం కాదు. ఇది కనీసం ఇరవై సంవత్సరాల ప్రయాణం , భావోద్వేగంగా, ఆర్థికంగా, మరియు మానసికంగా ఒక పెద్ద బాధ్యత. ప్రతి దశలో తల్లిదండ్రులు పిల్లలకు దారి and, ప్రోత్సహిస్తారు, తప్పులు చేసినప్పుడు అర్థం చేసుకుంటారు.
అందుకే, ఎవరికైనా ఒక పిల్లవాడు ఉండొచ్చు, మరొకరికి ఇద్దరు లేదా ముగ్గురు ఉండొచ్చు , ఇందులో సరైనదీ, తప్పిదమూ అనేవి లేవు. ముఖ్యమైనది, ప్రతి పిల్లవాడిని మనం ఎంత ప్రేమతో, ఎంత సమయంతో, ఎంత శ్రద్ధతో పెంచుతున్నామనే విషయం.
తల్లిదండ్రులు తీసుకునే ఈ నిర్ణయం వారి కుటుంబ పరిస్థితులు, శారీరక సామర్థ్యం, మరియు భావోద్వేగ స్థిరత్వంపై ఆధారపడాలి. సమాజపు ఒత్తిడి లేదా పోలికలపై కాదు.
పిల్లలను పెంచడం పోటీ కాదు, అది ప్రేమతో నిండిన దీర్ఘకాల బాధ్యత.
మన సమాజం ఒక్కసారి ఆలోచించాలి ...
ఎవరైనా తమ ఇంట్లో ఎంతమంది పిల్లలు కలిగారు, లేక కలగలేకపోయారు అనే విషయం వ్యక్తిగతం.
అది వైద్యమైనా కావొచ్చు, భావోద్వేగమైనా కావొచ్చు, ఆ నిర్ణయం లేదా పరిస్థితి మీద ఎవరికి వ్యాఖ్యానించే హక్కు లేదు.
తల్లిదండ్రుల గది అంటే ఒక పవిత్రమైన స్థలం , అక్కడ వారి నిర్ణయాలు, బాధలు, మరియు ఆశలు దాచబడి ఉంటాయి. Let's stop looking into someone's private space..
ఆ గదిలోకి, ఆ మనసులోకి, మనం ఒక చూపు కూడా వేయకూడదు.
జోక్యం అంటే సరదాగా అనుకున్నా, మాటల్లో ప్రేమ ఉందనుకున్నా ..మరొకరి మనసును తాకే విధంగా hurting ga, joking ga మాట్లాడే హక్కు ఎవరికీ లేదు.
కాబట్టి, ఈ voiceofchittan బ్లాగ్ ద్వారా ఒక చిన్న విజ్ఞప్తి ..పిల్లల గురించి నిర్ణయం తీసుకునే హక్కు తల్లికి కాస్త ఎక్కువగా ఉండాలి ..
ఆమె శరీరం గడిచే కష్టాలను ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఆ తల్లికి మాత్రమే తెలుసు, గర్భం దాల్చినప్పుడు తనలో జరిగే మార్పులు, భయాలు, సంతోషాలు, నొప్పులు.
ఎవరో ఒకరి గర్భం గురించి, పిల్లల సంఖ్య గురించి మాట్లాడే ముందు,
“ఆమె శరీరం, ఆమె అనుభవం, ఆమె హక్కు” అని గుర్తు పెట్టుకుందాం.
పిల్లలను కనడం మహత్తరమైన అనుభవం ..
కానీ ఆ నిర్ణయం తీసుకునే హక్కు అమ్మదే, ఎవరూ ఆమెను బలవంతం చేయకూడదు.
ఎందుకంటే ప్రేమతో, ధైర్యంతో, త్యాగంతో మనం ప్రాణాన్ని ప్రాణం ద్వారా సృష్టించేది ఆమెే కదా.
మాటలతో మానసికంగా బాధ పెట్టడం మానేద్దాం.
అమ్మగా పిల్లను కనడం ఒక అద్భుత అనుభవం అయినా, ఆ నిర్ణయం తీసుకునే హక్కు ప్రధానంగా ఆ మహిళదే. ఎందుకంటే శరీరాన్నీ, మనసునీ పణంగా పెట్టి ఆ బాధ్యతను భరించేది ఆమె. కొంతమంది ఆరోగ్య సమస్యల వలన పిల్లల్ని కనలేకపోతే, లేదారెండు లేదా మూడు ప్రసవం కనకూడదని నిర్ణయించుకున్నా , ఆ విషయం వ్యక్తిగతం. ఎవరూ వారి జీవితంలోకి తొంగి చూడటానికి లేదా సరదాగా అయినా వ్యాఖ్యలు చేయటానికి హక్కు లేదు.
ప్రతి మహిళకీ అటువంటి స్వేచ్ఛా నిర్ణయం తీసుకునే అదృష్టం ఉండదు.
సమాజం, కుటుంబం, పెద్దవాళ్లు, అభిప్రాయాలు , ఇవన్నీ కలిపి ఆమె మనసులో ఎన్నో గోడలు కడతాయి.
కానీ ఆ గోడల మధ్యనుంచి వెలుగుగా నిలబడి,
“ఇది నా శరీరం, నా నిర్ణయం, నా జీవితం” అని చెప్పగలగడం ..
అది నిజంగా ఒక ఆత్మవిశ్వాసం, ధైర్యం, మరియు సమానత్వానికి చిహ్నం.
అమ్మగా మారే కష్టం, భయం, ఆనందం అన్నీ మనసారా అర్థం చేసుకునే అభిమానం, పరిపక్వత, స్నేహం ఉన్నప్పుడు మాత్రమే స్త్రీకి ఆత్మగౌరవం, శాంతి, మరియు ప్రేమ రెండూ కలుగుతాయి.
ప్రేమ అంటే కేవలం జాగ్రత్తగా చూడటం కాదు , మనసును అర్థం చేసుకుని స్వేచ్ఛను గౌరవించడం. ❤️
కాబట్టి,
తీర్పులు ఇవ్వకుండా అర్థం చేసుకోవడం నేర్చుకుందాం.
ఒకరు dozen పిల్లలు కలగాలని నిర్ణయిస్తే ...సూపర్! వారు ఆ ఆనందాన్ని పూర్తి హృదయంతో ఆస్వాదించాలి.
అలాగే, ఒకరు ఒకే పిల్ల, లేదా ఇద్దరు, లేదా మరేదైనా నిర్ణయిస్తే .. ఎవరూ తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదు.
Stop Judging as it's their personal...ఎందుకంటే ప్రతి కుటుంబం వెనుక ఒక కథ ఉంటుంది ..మనకు అది కనిపించకపోయినా, అది వారికే తెలుసు, వారికే సత్యం.
కాబట్టి తమ భార్యలను, సోదరీమణులను అర్థం చేసుకున్న సోదరులందరికీ (నా నిర్ణయాన్ని గౌరవించే నా భర్తతో సహా) నా హృదయపూర్వక ధన్యవాదాలు..
వాళ్ల వల్లే సమాజం మారుతోంది.
వాళ్ల వల్లే ఒక మహిళ తన నిర్ణయాన్ని భయపడకుండా, గర్వంగా చెప్పగలుగుతోంది.
Finally...it's your life..your decision..You have your theory which suits to your family...Never lose yourself for someone's theory
With 💕
Swetha Vishnuchittan
Comments
Post a Comment