Skip to main content

Posts

Showing posts from October, 2025

మీకు ఎంతమంది పిల్లలు? ఒక్క ప్రశ్న, ఎన్నో అభిప్రాయాలు"

 ఎన్నో సంవత్సరాలుగా నాకు ఒకే ప్రశ్న పదేపదే వినిపిస్తోంది .... “రెండో పిల్ల ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు?” “ఒక్కరితో సరిపోతుందా?”  నేను చిరునవ్వుతో “ప్లాన్ చేయడం లేదు” అని చెబితే వెంటనే చాలా మందికి ఒక లెక్చర్ మొదలవుతుంది  “ఒకరే ఉంటే ఒంటరితనం వస్తుంది”, “సోదరుడు లేకుంటే ఎలా నేర్చుకుంటాడు?”, “పెద్దవయసులో తోడుండడానికి ఇంకొకరు ఉండాలి కదా”, "సోదరుడు లేకుంటే సంబంధాలు నేర్చుకోడు”, “తల్లిదండ్రుల తర్వాత ఎవరు ఉంటారు?” అని అనేక కారణాలు చెబుతారు.… ఇలా మరెన్నో. వారి మాటల్లో ప్రేమ ఉంటుందని నాకు తెలుసు, కానీ కొన్నిసార్లు ఆ ప్రేమే మనసుపై మౌన ఒత్తిడిగా మారుతుంది. నేను ఒక బలమైన మహిళను, సమాజం మాట్లాడేది పెద్దగా పట్టించుకోను. ఏ నిర్ణయం తీసుకున్నా నాలో నిశ్చయం ఉంటుంది. కానీ, ఇటీవల చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న మౌన ఒత్తిడి నన్ను నిజంగా బాధపెట్టింది. చాలా చాలా బాధపెట్టింది... అందుకే ఈ బ్లాగ్ రాయాలని అనిపించింది.అవును… ఇదే విషయం నన్ను లోతుగా తాకింది. 1. Other side of the coin ,కొంతమంది దంపతులు ఆరోగ్య సమస్యల వలన, ముఖ్యంగా PCOD, హార్మోనల్ ఇబ్బందులు, లేదా ఇతర వైద్య కారణాలు వలన పిల్లలు కలగకపోవచ్...